Devaruppula

Devaruppula

Share

24/10/2020

శుభం. ఇవాళ సద్దుల బతుకమ్మ. ఆరుపదుల వయసున్నవారికి గుర్తున్న విషయం.ఈ తరం వారికి తెలియచెప్పాలని...ఇంట్లో అమ్మ ఇంకా మిగతా ఆడవాళ్లు కలిసి 9 రకాల సద్దులు చేస్తూనే బతుకమ్మను పేర్చేవారు. బతుకమ్మను దేవునిదగ్గర పెట్టి సద్దుల తిని సాయంత్రం బతుకమ్మను అమ్మ వాగులోకి తీసుకొనిపోయేది.పోయేటప్పుడు పందార పెసర పప్పు, రూపాయో రెండు రూపాయలో వెంట తీసుకొని పోయేది. ఆ పప్పు రుచిగా ఉండేది. నాకొద్దిగా పెట్టావా అంటే వాగులో గౌరమ్మను నైవేద్యం పెట్టకముందు ఎవ్వరూ తినవద్దనేది. పోనీ రాత్రి బతుకమ్మ ఆడి ఇంటికి వచ్చేప్పుడే తెస్తదా అంటే అదీ లేదు. పప్పు సహా ఆ రెండు రూపాయల్లో ఒకటి పూజ చేసి అయ్యగారి కి ఇంకో రూపాయి బతుకమ్మల ముందు డప్పు చప్పుళ్లతో ముందు నడిచే డప్పు కళాకారులకు ఇచ్చేది. అమ్మ కొంగులో కట్టుకున్న కొద్దిపాటి పందార పప్పు తిందామంటే అది తినొద్దు. తింటే గజ్జి పుండ్లు అయితాయని బెదిరించేది. పొరపాటున పుండ్లే అయితే అమ్మ వెంటనే అనేది..ఎప్పుడో సద్దుల బతుకమ్మ నాడు పందార పప్పు తిన్నవాని అనేది. అన్నట్టు పందార అంటే చక్కర..అప్పట్లో పందార ఆనేవాళ్ళం

07/09/2020

,😊

06/09/2020

చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ..

01/08/2020

దేవరుప్పుల లో భారీ వర్షం

Want your business to be the top-listed Travel Agency in Uppal?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Uppal