Pathipally
11/12/2022
తెలంగాణలో సర్పంచ్ జీతం 3000
అంటే సంవత్సరానికి 36,000
మొత్తం 5 ఏళ్ళకి 1,80,000
కానీ మనవాళ్ళు ఎలక్షన్ కి ఖర్చు పెట్టేది ఇంచుమించు 20,00,000..
ఏ ధైర్యంతో ఇంత ఖర్చు చేస్తున్నారు?
మీకు అర్ధమైతే ఒక్కసారి మాతో పంచుకోండి ప్లీజ్..
విచిత్రమేంటంటే కాలం ముగిసేలోగా మన వాళ్ళు అది సంపాదించి పైగా అంతకుఅంత వెనకేసుకుంటున్నారు! ఎలా??
మీకు తెలుసా!!
మీరు ఎప్పుడైనా గ్రామ సభకు వెళ్ళారా? ఒక్క గ్రామ సభకు ఎంత ఖర్చు పెడుతున్నారు?
అంబేడ్కర్ గారి విగ్రహం పెట్టమని కాదు మా స్కూల్ ని బాగు చేయండి అని ఎప్పుడైనా అడిగారా?
రామాలయం కాదు మనకి పర్మినెంట్ డాక్టర్ ఉండే ప్రాధమిక ఆసుపత్రి ఉంటే బాగుంటుందని అడిగారా?
మన ఊరి మొత్తం మీద ఇంటి పన్ను ఎంత వసూలు అవుతుంది ఎపుడైనా కనుక్కున్నారా?
మీ పంచాయతీలో గవర్నమెంట్ ఉద్యోగులు కాక మిగతా వారికి జీతం ఎంత ఇస్తున్నారు ఎంత రాస్తున్నారు చూసారా?
గవర్నమెంట్ స్థలాల్లో కొట్లు పెట్టుకున్నవారు పంచాయితీకి ఎంత కడుతున్నారు, వారు లెక్కల్లో ఎంత చూపిస్తున్నారు తెలుసుకున్నారా?
ఉపాధిహామీ పథకంలో ఎంతమంది 50-50 కి ఒప్పుకుని ఇంట్లోనే కూర్చుని సంపాదిస్తున్నారో తెలుసా?
పింఛను ఎంతమంది తీసుకుంటున్నారు?
ఎస్సి నిధులు ఎస్సి పేటలోనే ఖర్చు చేస్తున్నారా అని అడిగారా?
మీకు తెలుసుకోవాలనుంటే క్రింద అప్లికేషన్ పిక్ పెడుతున్నా.. ప్రింట్ తీసుకుని మీరు అడగాలనుకుంటున్నవి రాసి మీ పంచాయతీలో ఇవ్వండి. తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ పెట్టండి పైసా ఖర్చు ఉండదు. ఇచ్చేటపుడు మీ సెల్ లో వీడియో తీయండి. మీ పంచాయితీకి మంచి రోజులు వచ్చినట్టే.. ప్రామిస్.
Click here to claim your Sponsored Listing.
Category
Culinary Team
Attire
Contact the organization
Website
Address
Pathipally
Mulugu
506352