Spark

Spark

Share

05/07/2018

వెజిటబుల్‌ పిజ్జా

కావలసినవి

గోధుమపిండితో చేసిన పిజ్జా బేస్‌-ఒకటి, పెద్ద టొమాటోలు -మూడు (సన్నటి ముక్కలుగా తరిగి), మరో పెద్ద టొమాటో-ఒకటి (గుండ్రంగా రింగులుగా కోసి), ఉల్లిపాయ (పెద్దది)- ఒకటి (ముక్కలుగా తరిగి), కాప్సికం ముక్కలు-ఒక కప్పు (పసుపు, ఆకుపచ్చ, ఎరుపు కాప్పికమ్‌లు వాడాలి), పుట్టగొడుగులు-పది (సన్నగా తరిగి), చీజ్‌- అర కప్పు (తురుము), ఉప్పు, మిరియాలపొడి- రుచికి సరిపడా, చక్కెర- ఒక టేబుల్‌స్పూను, ఆలివ్‌ ఆయుల్‌-ఒక టేబుల్‌స్పూను.

తయారీవిధానం

పాన్‌లో ఆలివ్‌ ఆయిల్‌ వేడిచేయాలి. ఉల్లిపాయముక్కలను అందులో వేసి కాసేపు వేగించాలి. టొమాటో ముక్కలను వేసి మెత్తగా అయ్యేదాకా వేగించాలి. రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి వేయాలి. చక్కెర కూడా కలపాలి. తర్వాత అరకప్పు నీళ్లు పోసి దగ్గరపడేదాకా స్టవ్‌పై ఉడికించాలి. పిజ్జా బేస్‌ తీసుకుని ఈ సాస్‌ని దానిపై పరవాలి.

తరిగిపెట్టుకున్న కాప్సికం, పుట్టగొడుగుల ముక్కలు సాస్‌పై చల్లాలి. చివరిగా చీజ్‌ తరుగును కూడా పిజ్జాపై చల్లాలి. పిల్లలకు ఇష్టమైతే కొత్తిమీర లేదా పుదీనాను కూడా పిజ్జాపై చల్లొచ్చు. దీన్ని హాట్‌ ఒవెన్‌లో ఐదు నిమిషాలు బేక్‌ చేసి వేడి వేడిగా ఆరగించొచ్చు.

Photos 06/06/2017

***కొత్తిమీర, లెమన్ సూప్‌***

కావల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన కొత్తిమీర - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ - 1, ఉల్లికాడలు - 1, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లిపాయ - 1, నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు, వెజిటబుల్‌ స్టాక్‌ - 4 కప్పులు, మిరియాల పొడి - కొంచెం, ఉప్పు - రుచికి సరిపడా, వెన్న - 1 టీ స్పూను

తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయ, ఉల్లికాడ, అల్లం, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఫ్రైయింగ్‌ పానలో వెన్న వేసి కరిగిన తరువాత అందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఉల్లికాడ ముక్కలు అన్నింటినీ వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి.

ముక్కలన్నీ మెత్తగా అయ్యేవరకు వేయించి, అందులో వెజిటబుల్‌ స్టాక్‌ (కూరగాయ ముక్కలు ఉడికించుకున్న నీళ్లు) పోసి బాగా ఉడికించాలి. తర్వాత కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. సూప్‌ చిక్కగా మారే సమయంలో స్టవ్‌ ఆఫ్‌ చేసేయాలి.

బట్టర్‌తో గార్నిష్‌ చేసుకుని, వేడివేడిగా సర్వ్‌ చేయాలి.

Want your restaurant to be the top-listed Restaurant in Kakinada?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Kakinada
533005