Devireddy Sudheer Reddy
తాగునీరు మా హక్కు…నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు?
ప్రజలకు నీళ్లు కావాలి… హామీలు కాదు!
22/05/2026
ఎల్బీనగర్ నియోజక వర్గంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు కుట్టు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు.
చంపాపేట్ డివిజన్ పరిధిలోని మోడల్ మార్కెట్ భవనం వెనుక ఉన్న కమ్యూనిటీ హాల్‌లో జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు కుట్టు యంత్రాల వినియోగం, వివిధ రకాల దుస్తుల కుట్టు విధానాలు, ఆధునిక డిజైనింగ్ పద్ధతులపై నిపుణులచే శిక్షణ అందించబడుతుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
ఆసక్తి గల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్.బి.నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాజి రెడ్డి, రవి ముదిరాజ్, యాది రెడ్డి, చీర శ్రీనివాస్, ప్రభాకర్, కనకేష్, సతీష్ గౌడ్, నందు, జంగయ్య గార్లు ట్రైనర్లు స్వయంప్రభ, రమాదేవి, ఉష, సంధ్య, ప్యారి గార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు మరియు పరిసర ప్రాంతాల మహిళలు పాల్గొన్నారు.
బ్రతికున్నంత కాలం కులమతాల పేరుతో మనుషులు విడిపోయినా… చివరి ప్రయాణంలో మాత్రం భేదాలు ఉండకూడదనే మానవతా దృక్పథంతో, అన్ని మతాల ప్రజల కోసం నాగోల్ ఫతుల్లాగూడలో 6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన “ముక్తి ఘాట్” ఎల్‌బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి గొప్ప ఆలోచనకు ప్రతీక.
21/05/2026
ఈరోజు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు నియోజకవర్గాల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు హాజరై ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు అంశాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా బైరామల్‌గూడ చెరువు అభివృద్ధికి పూర్తి స్థాయి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గారు కోరారు. సుమారు రూ.10 కోట్ల అంచనా వ్యయం ఉన్న ఈ పనులకు ఇప్పటివరకు కేవలం రూ.2 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని, మిగిలిన నిధులను వెంటనే విడుదల చేసి పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
హస్తినాపురం జంక్షన్ నుంచి సాగర్ కాంప్లెక్స్ వరకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ నిర్మాణం అత్యవసరమని పేర్కొన్నారు. అలాగే ఆనంద్‌నగర్ చౌరస్తా వద్ద కూడా ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న వీధి కుక్కల సమస్యపై ప్రత్యేకంగా స్పందిస్తూ, ఇటీవల కుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటనను ప్రస్తావించారు. స్టెరిలైజేషన్ కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కోరారు.
బీఎన్‌రెడ్డి నగర్ తెలంగాణ చౌరస్తా వద్ద రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని సూచించారు. అలాగే టీకేఆర్ కాలేజ్ సమీపంలో ప్రతిపాదిత ఫ్లైఓవర్ ప్రస్తుతం అవసరం లేదని, ఆ ప్రతిపాదనను పునఃసమీక్షించాలని కోరారు.
బీడీ రెడ్డి గార్డెన్ సమీపంలో భూ వివాదాల కారణంగా నిలిచిపోయిన స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులను వెంటనే పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హస్తినాపురం డివిజన్‌లోని ద్వారకా తిరుమల నగర్ ప్రాంతంలో ఒక మీటర్ పైప్‌లైన్ విస్తరణ చేపట్టి తాగునీటి సరఫరాను బలోపేతం చేయాలని కోరారు.
అలాగే మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని డంపింగ్ యార్డు సమీపంలోని పాత పోచంపల్లి రోడ్డు పునరుద్ధరణ కోసం అటవీ శాఖ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువుల వద్ద ఎస్‌టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసి చెరువుల సుందరీకరణ పనులు చేపట్టాలని కూడా ఎమ్మెల్యే గారు కోరారు.
ఈ సమస్యలపై సంబంధిత శాఖలు ప్రాధాన్యత ఆధారంగా స్పందించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించారు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Lal Bahadur Nagar
Hyderabad
500074