Mada Raja - R TV
11/11/2020
భరతమాతకు దండం పెడుతాం, అందరిలో అమ్మను.. చెల్లిని చూడమని చెబుతాం. ఆడవారిని గౌరవించమని కూడా చెబుతాం. అమ్మ అయిన తరువాత మన ఇంటికి ఆడపిల్లలను మాత్రం వద్దనుకొంటాం. ఇదే నా మన నవ జీవన నాగరికత..?!
ఇది కర్మ కాకపోతే మరేంటి. ఎవ్వరు ఎంత చెబుతున్నా ఇలాంటి చిన్న పిల్లల సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో ఈ మధ్య ఆడపిల్లలను కని పారేయటం ఫ్యాషన్ అయిపోతోంది. మరి దారుణంగా చెత్తని పారేసినట్లుగా చిన్న పాపను కవర్ లో పెట్టి వదిలేసారు మచ్చుకైన మానవత్వం లేని మనిషి జన్మ ఎత్తిన మానవ మృగాలు. ఇలాంటి ఎదవ పని చేసిన వారిని కోర్టు వెంటనే ఉరి తీసిన తప్పులేదు.
దయచేసి మీకు ఇలాంటి వారు కంటపడితే అందరు కలిసి నాలుగు తగిలించి పోలీసులకు అప్పచెప్పండి వాళ్ళను. ప్రభుత్వం వారు ఆడపిల్లల సంరక్షణకై మరింత కట్టుదిట్టమైన భద్రత గల చట్టాలను తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపై డెలివరి అయ్యాక రిజిష్టర్ చేసుకొనే ప్రక్రియను ప్రెగ్నేసి కన్ ఫామ్ అని తెలిసినప్పటినుండి వారి వివరాలను తెలుసుకొని రిజిష్టర్ చేసుకొనేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడైన ఇలాంటివి 1% అయిన తగ్గుతాయేమో చూడాలి.
చిట్టి తల్లి నీకు వందనం.. నీలాంటి వారు పెరిగి పెదై నిన్ను ఇలా కనిపరేసిన ఎదవలను చెప్పుతో కొట్టినట్లుగా, దేశ భవిష్యత్ కి గర్వకారణం కావాలని ఆ దేవున్నీ ప్రార్దిస్తున్నాం తల్లీ..!!
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Hyderabad
500038