Radical Roasts

Radical Roasts

Share

18/01/2025

ఎవరన్నారు మీరు లేరని

కొండలు చీల్చుకుంటూ పారి, గొంతులు తడిపే తెలుగుగంగలో ఉన్నారు.
గుండె లోతుల్లో నుంచీ పలికే జై తెలుగుదేశం నినాదాల్లో మీరే ఉన్నారు.
తరాల తలరాతలు మార్చిన సంతకాల్లో మిరే ఉన్నారు.
ఆ సంతకాల కారణంగా సంతోషంతో కూడిన నవ్వుల్లో మీరే ఉన్నారు.
ఇప్పటికీ ఢిల్లీని ఢీ కొట్టాలనే ధైర్యంలో మిరే ఉన్నారు.
ఎప్పటికీ మాకున్న అన్నగారిగా మిరే ఉంటారు.

మీరిచ్చిన ఆడబిడ్డలకి ఆస్తిలో వాటా ఈరోజు పార్లమెంటు సీట్లలో వాటా దాకా వెళ్ళింది.
బడుగుల గుండెల్లో మీరు నింపిన ధైర్యం ఈరోజు అధికారంలో వాటా దాకా వెళ్ళింది.
నడిచొచ్చిన ఆత్మగౌరవానికి ఆరడుగుల రూపం మీరు,
నిలబెట్టాల్సిన తెలుగు ఖ్యాతికి నిండైన రూపం మీరు,
సడి చచ్చిన మా తెలుగు నేలకు మళ్ళీ పుట్టాల్సిన అవసరం మీరు.

మీకు కులం అద్దాలని, ప్రాంతం అద్దాలని, కళంకం అద్దాలని చూసే కుక్కలు తెలుగు నేల మీద చాలా వున్నాయి, అవి మిముల్ని చూడాలన్నా సరే, మీరు పెట్టిన హుస్సేన్ సాగర్ లో బుద్ధిడిని చూసినట్టు మీకోసం మెడ నిక్కించి చూడాల్సిందే.

17/11/2024

ఒక మనిషి బాగా బతికాడు, రాజులా వెళ్ళిపోయాడు అని ఎప్పుడు చెప్పగలం?
ఉన్నన్ని రోజులు కాదు, ఆ మనిషి లేకపోయినా సరే, మొదలుపెట్టిన పనులు, చేసిన పనులు ఇంకా ప్రజలకి మంచి చేస్తుంటే, భవిష్యత్తు తరాలకు పాఠాలు చెప్తుంటే అప్పుడు చెప్పొచ్చు.

చెరుకూరి రామోజీరావు గారు.చెప్పాలంటే తెలుగు ప్రజలకు అత్యంత నమ్మశక్యం అయిన వార్తలు అందించే ఈనాడు,ఈటీవీ అయినా, విదేశాల్లో ఉన్నా సరే నమ్మకంగా తెలుగు పచ్చళ్ళ కోసం వెతికే ప్రియా పచ్చళ్ళు అయినా, కొడుకు చదువుకోసం లేదా కూతురు పెళ్ళి కోసం సామాన్య ప్రజలు డబ్బులు దాచుకునే మార్గదర్శి అయినా, ఇలా తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇవి అన్నీ కూడా అందరికీ తెలిసిందే.

70ల్లో అప్పటికి జనాలకి అర్ధం కాని భాషల్లో వచ్చే పత్రికలను కాదని, వార్తలు అంటే సామాన్య ప్రజలకు అర్ధం అయ్యేలా ఉండాలని సామాన్య ప్రజల భాషలో మొదలుపెట్టిన ఈనాడు, ఇప్పటికీ కూడా ప్రజల గొంతు అయింది.

80ల్లో గవర్నర్ పదవి అడ్డంపెట్టుకుని, కేంద్రం రాష్ట్ర ప్రయోజనాల మీద కేంద్రం చేసిన దూరగతాల మీద ఆయన చొరవ తీసుకుని చేసిన పోరాటం తర్వాత కాలంలో ప్రభుత్వాలని మార్చింది.

ఇకపోతే 90ల్లో గ్రామాల్లో ప్రభలిన సారా మీద ఈనాడు వేదికగా రామోజీరావు గారు చేసిన యుద్ధం విలువ ఇప్పటి తరాలకు ఎలా చెప్తే అర్ధం అవుతుంది. ఆరోజున ఒక్కడే నిలబడి, ప్రభుత్వానికి, సారాకి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం తర్వాత కాలంలో 2 తరాలకు మంచి భవిష్యత్తు అందించింది. లేదంటే ఇప్పటి ఉత్తరాది రాష్ట్రాల మాదిరే తెలుగు రాష్ట్రాలు కూడా అయ్యేవి.

ఇక ప్రభుత్వాలు, అధికారులకి వ్యతిరేకంగా 2000లో ఆయన మొదలుపెట్టిన సమాచార హక్కు విప్లవం, ఆ హక్కు వచ్చిన తరువాత కూడా దాని మీద అవగాహన కోసం ఈనాడులో ఒక కాలమ్ ఉండేది.

ఇక తెలుగు భాష వాడుకలో పెరిగిపోతున్న ఆంగ్ల పదాలకి అడ్డుకట్ట వేయడానికి ఈనాడు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు చూస్తున్నాం.

మార్గదర్శి బూచిగా పెట్టి భయపెట్టాలని చూస్తే, సింగిల్ పేమెంట్ లో డిపాజిట్ దారుల డబ్బు అంతా బ్యాంక్ లో వేసి, ఎందుకని తన పేరుకి అంత నమ్మకం అనేది చూపెట్టారు ఆయన.

ఇక ప్రభుత్వంలో ఉండి యాడ్స్ ఇవ్వం, ఒత్తిడి చేస్తాం అని రంకెలు వేసిన వాళ్ళని కనీసం ఊకలో ఈక మాదిరి కూడా గుర్తించలేదు.

లక్ష నాగళ్లతో దున్నుతాం అని ఎగిరిన వాడు తర్వాత రోజుల్లో ఆయన దగ్గరకే వెళ్లి మరీ ఆశీర్వాదం తోసుకోవాల్సి వచ్చింది. ఇక ఆయనకి ఎదురుగా మీడియా పెట్టి, లేచినప్పటి నుంచీ ఆయన మీద పడి ఏడ్చిన సన్నాసి తర్వాత ఆయన అపాయింట్మెంట్ కోసం అడుక్కొని, ఛీ పో అంటే ఎక్కడో ఒక ఫంక్షన్ లో ఆయన పక్కన నంగి ఫోటో తీసుకుని స్వయం తృప్తి పడాల్సి వచ్చింది.

ఆయన తనని ప్రభుత్వాలు దేని కోసం అయినా, సంప్రదించినప్పుడు పొంగిపోలేదు, అలా అని భయపెట్టినప్పుడు పారిపోలేదు.

ఫైనల్ గా ఒకటి చెప్పాలి, పని చేయలేక ఈనాడు వదిలిపోయిన ప్రతిఒక్కరు ఒకమాట అంటారు. రామోజీ ఫిల్మ్ సిటీ లోపలకి ఎవరు వెళ్ళాలి అన్నా, ఆయన అనుమతి కావాలని. కీరవాణి గారు అన్నట్లు, ఉత్తరాయణ పుణ్య కాలం వచ్చేదాకా భీష్ముడు చావుని ఆపినట్లు, తెలుగు ప్రజలకు మంచి పాలన వచ్చేదాకా ఈ భీష్ముడు కూడా చావుని ఫిల్మ్ సిటీకి బయటే ఆపారు.

Want your organization to be the top-listed Government Service in Chennai?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Chennai