SDPI ADONI A.P
31/05/2026
రోజురోజుకీ పెరుగుతున్న ప్రజా మద్దతు – ఎస్‌డీపీఐ వైపు
30/05/2026
ఆదోని జంకంవాడి ప్రాంతానికి చెందిన యువకులు
ఈ రోజు SDPI పార్టీలో చేరారు.
పార్టీ నాయకుల సమక్షంలో సభ్యత్వం పొందారు
30/05/2026
ప్రెస్ రిలీజ్
అదోని పట్టణంలో క్రికెట్‌పై యువతకు రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. ఎంతో మంది ప్రతిభావంతమైన క్రికెట్ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. కానీ సరైన క్రికెట్ మైదానాలు మరియు స్టేడియం లేకపోవడం వల్ల యువ క్రీడాకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో Social Democratic Party of India అదోని శాఖ తరఫున ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము — అదోని ప్రజల కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించాలి.
క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి రాష్ట్రానికి, దేశానికి మంచి క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. అదోనిలో సరైన గ్రౌండ్లు లేక యువత రోడ్లపై మరియు చిన్న ప్రదేశాల్లో ప్రాక్టీస్ చేయాల్సిన పరిస్థితి ఉంది.
కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అదోని ప్రజల కల అయిన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని SDPI అదోని డిమాండ్ చేస్తోంది.
అలాగే అదోని కూటమి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి, అదోనిలో క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము.
Ghouse khan
Sdpi convener adoni
28/05/2026
🕌 ఈద్ ఉల్ అద్హా శుభాకాంక్షలు 🕌
🌙✨ అందరికీ హ్యాపీ బక్రీద్ ✨🌙
ఈ పవిత్రమైన బక్రీద్ పండుగ సందర్భంగా
అల్లాహ్ మీ అందరికీ శాంతి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
తరఫున:
SDPI 1వ వార్డు శాఖ
ఖూనిమొహల్లా, ఆదోని
27/05/2026
సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI)
సభ్యత్వ నమోదు కార్యక్రమం
📍 ఖూనీమోహల్లా ప్రాంతం, 1వ వార్డు శాఖ
📌 ఆదోని, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
సమాజంలో న్యాయం, శాంతి మరియు సమానత్వం కోసం
SDPI పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తోంది.
ఈ సందర్భంగా ఖూనీమోహల్లా ప్రాంతంలో
సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
👉 ప్రజల హక్కుల కోసం పోరాడే ఉద్యమంలో
మీరు కూడా భాగస్వాములు అవ్వండి.
✊ న్యాయం కోసం – శాంతి కోసం – సమానత్వం కోసం
👉 SDPIలో చేరండి
24/05/2026
Join SDPI save DEMOCRACY
18/05/2026
అదోనిలోని బంగారు కార్మికుల సంఘం (Gold Smith Association) ఇచ్చిన బంద్ పిలుపుకు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) – అదోని సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది.
Modi ji bolte hi gold ko purchase mt kro
Lekin india me 70 % logon ko khana kharedne k liye paisa nahi
15/05/2026
#సోషల్_డెమోక్రటిక్_పార్టీ_ఆఫ్_ఇండియా, SDPI జాతీయ అధ్యక్షుడు ఎం. కె. ఫైజీ, #న్యూఢిల్లీ లోని నిజాముద్దీన్‌లో ఉన్న కేంద్ర కార్యాలయంలో పార్టీ యువజన విభాగమైన #యంగ్_డెమోక్రాట్స్ పతాకాన్ని ఆవిష్కరించారు.
14/05/2026
సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI), ఆదోని
తేదీ: 14-05-2026
ఆదోని పట్టణంలో ఉన్న ఉర్దూ గర్ల్స్ కాలేజీని తక్షణం ప్రారంభించాలనే డిమాండ్‌తో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI), ఆదోని తరఫున గౌరవనీయులైన సబ్ కలెక్టర్ గారికి 20-04-2026న వినతిపత్రం సమర్పించబడింది.
ఈ వినతిపత్రంలో కాలేజీ భవనం పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రారంభించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే కాలేజీ ప్రారంభించి, అవసరమైన బోధనా మరియు బోధనేతర సిబ్బందిని నియమించాలని కోరడం జరిగింది.
ఈ అంశాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ కాలేజీ ప్రారంభం ఆలస్యం అవ్వడం వలన పేద మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థినులు విద్యావకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
ఇది ఒక సానుకూల ముందడుగు అని భావిస్తూ, ఇన్‌షా అల్లాహ్ త్వరలోనే ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభమై విద్యార్థినులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము.
ఈ సమస్యను ముందుకు తీసుకెళ్లినందుకు గౌరవనీయులైన కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
సద్దాం హుస్సేన్
కో-కన్వీనర్, SDPI ఆదోని
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Adoni
518301