CPM ADONI
17/03/2026
ప్రభుత్వ అనుమతులు లేకుండా రంగురంగుల కాగితాలు, రాళ్లతో ప్రజలను ఆకర్షిస్తున్న అక్రమ వెంచర్ల పై చర్యలు తీసుకోవాలి....సిపిఎం......ఆదోని.
పట్టణం లోని విస్తరిస్తున్న తరుణంలో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగురంగుల కాగితాలు ముద్రించి ప్రజలను మభ్యపెడుతూ ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఆకర్షణీయమైన వెంచర్లు వేస్తూ వ్యాపారం చేస్తున్న వెంచర్ల యజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, మండల కార్యదర్శి లింగన్న, మున్సిపల్ కమిషనర్ నయీమ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వీరు మాట్లాడుతూ పట్టణంలోని నలుమూలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తు కొత్త కొత్త వెంచర్లు ఎస్టేట్ల పేర్లతో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారని వారు తెలిపారు. దీంతో పట్టణంలో నిత్యం కబ్జాల పేరుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వారు తెలిపారు .కావున ఇప్పటికైనా సంబంధం అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ అనుమతులు లేకుండా పట్టణంలో అక్రమ వెంచర్లు వేసి ధనార్జన దేయంగా ప్రజలను మభ్యపెడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము.
06/11/2025
కల్లుబావిలో స్మశాన వాటికకు రక్షణ గోడ,
మంచినీటి సమస్య పరిష్కారం కొరకు ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలనీ ఈనెల 10వ తేదీ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయండి..., సిపిఎం...
ఆదోని పట్టణ సమస్యలు పరిష్కరించాలని, ఆదోని సమగ్రాభివృద్ధి కొరకు ఈనెల 10వ తేదీ ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కల్లుబావిలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. పాదయాత్ర ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు, పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, వీరు మాట్లాడుతూ ప్రధానంగా కల్లుబావి స్మశాన వాటికకు కల్లుబావి, శంకర్ నగర్, ప్రకాష్ నగర్, భాస్కర్ రెడ్డి కాలనీ, వైయస్సార్ కాలనీ, భీమ్ రెడ్డి కాలనీ ప్రజలకు ఇది ఒకటే స్మశాన వాటిక ఉంది.అయితే ప్రస్తుతం స్మశాన వాటికకు రక్షణ గోడ లేకపోవడంతో రాత్రి వేళలో కుక్కలు, పందులు స్మశానం లో ఉన్న శవాలను బయటకు తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్న ఇళ్ల మధ్యలో వదిలేసి వెళ్లడం జరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళన గురవుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారు తెలిపారు. అలాగే స్మశాన వాటికకు వెళ్లి వచ్చిన తర్వాత కనీసం కాళ్లు (శుభ్రం చేసుకోవడానికి)కడుక్కోవడానికి కూడా నీటి సౌకర్యం లేదు.కావున స్మశాన వాటికకు రక్షణ గోడ, రోడ్డు నీటి సౌకర్యము,విశ్రాంతి షెడ్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా భాస్కర్ రెడ్డి కాలనీ నందు మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలనీ వారు తెలిపారు. శంకర్ నగర్ దగ్గర ఉన్న వంకకు రక్షణ గోడ నిర్మించి, రోడ్డు సౌకర్యం కల్పించాలి. బీసీ కాలనీ, ప్రకాష్ నగర్ నందు స్త్రీల మరుగుదొడ్ల సమస్యను పరిష్కారం చేయాలి. అదేవిధంగా శంకర్ నగర్ లో ఉన్న ఎస్సీ కాంప్లెక్స్ మరమ్మత్తు పనులు చేపట్టి, మహిళలకు ఉపాధి శిక్షణ కేంద్రంగా మార్చాలనీ వారు డిమాండ్ చేశారు . ఈ ప్రాంతంలో మంచి నీటి సమస్య పరిష్కారం కొరకు ఓహెర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.పై సమస్యల పరిష్కారం కొరకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు మహాధర్నాను ప్రజల అధిక సంఖ్యలో పాల్గొవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, ముక్కన్న, తిప్పన్న, నాయకులు నాగరాజు, కృష్ణమూర్తి, మల్లయ్య, మనోహర్,రామదాసు, ఉరుకుందు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Adoni
518301