Veda Software
15/11/2024
కూసుమంచి,రిపబ్లిక్ హిందుస్థాన్: కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కూసుమంచిలోని గణపేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు.శుక్రవారం తెల్లవారుజామున కార్తిక స్నానాలు ఆచరించి శివాలయానికి వచ్చి మహాశివుని దర్శించుకున్నారు. స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం.ఈ సందర్భంగా భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు శేషగిరి శర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు.దీంతో శివాలయం కోలాహాలంగా మారింది. శివాలయానికి వచ్చిన భక్తులకు ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో పులిహార ప్రసాదం అందజేశారు.
కూసుమంచి గణపేశ్వరాలయానికి పోటెత్తిన భక్తజనం….! కూసుమంచి,రిపబ్లిక్ హిందుస్థాన్: కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కూసుమంచిలోని గణపేశ్వరాలయానికి భక్తులు పోటె.....
07/11/2024
ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ-2008లో నష్టపోయిన 2,367 మంది అభ్యర్థులను కాంట్రాక్టు టీచర్లుగా నియమించేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఆనాడు నష్టపోయిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సెప్టెంబరు నెలాఖరులో విద్యాశాఖ కోరింది. ఈక్రమంలో ఆయా ధ్రువపత్రాలను పరిశీలించి వారికి కొలువులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సంగారెడ్డి, నల్గొండ, రంగారెడ్డి, హనుమకొండ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బాధితులున్నట్లు గుర్తించారు. ఒక్కో జిల్లాకు ఒక సీనియర్ అధికారిని పరిశీలకునిగా నియమించారు. ఈ నెల 8లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
త్వరలో డీఎస్సీ-2008 బాధితులకు కాంట్రాక్టు టీచర్లుగా అవకాశం ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ-2008లో నష్టపోయిన 2,367 మంది అభ్యర్థులను కాంట్రాక్టు టీచర్లుగా నియమించేందుకు ...
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Website
Address
Adilabad
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |
| Sunday | 9am - 5pm |