Jakka Venkat Reddy

Jakka Venkat Reddy

Share

18/06/2026
10/06/2026

- పీర్జాదిగూడ పరిధిలో పారిశుద్ధ్య పనుల మెరుగుదల, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణంపై జోనల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేసిన మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ, మేడిపల్లి డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, దొంతిరి హరిశంకర్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, మైనారిటి అధ్యక్షులు జిలాని పాషా,ఆకుల మధుకర్ తదితరులు కలిసి ఉప్పల్ జోన్ జోనల్ కమిషనర్‌ రాధిక గుప్త IAS, బోడుప్పల్ సర్కిల్ డిప్యుటీ కమీషనర్ ఏ.శైలజ లకు వినతి పత్రం అందజేశారు.

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజా పర్యటనలో భాగంగా పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపురం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలను సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నామని తెలిపారు.

ప్రధానంగా లేవనెత్తిన అంశాలు:

• పారిశుద్ధ్య లోపాలు – దోమల బెడద:
అంతర్గత కాలనీల్లో క్రమం తప్పకుండా రోడ్లు ఊడ్చకపోవడం, వీధుల మూలల్లో చెత్త పేరుకుపోవడం వల్ల వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

• రోడ్డు స్వీపింగ్ యంత్రాల ఏర్పాటు:
ప్రధాన రహదారుల శుభ్రత కోసం ఆధునిక రోడ్ స్వీపింగ్ మెషిన్లను వినియోగిస్తే పారిశుద్ధ్య సిబ్బంది అంతర్గత కాలనీల పరిశుభ్రతపై మరింత సమయం కేటాయించే అవకాశం ఉంటుందని సూచించారు.

• పాత పారిశుద్ధ్య విధానం అమలు:
గతంలో ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి నిర్దిష్ట ప్రాంత బాధ్యతలు అప్పగించిన విధానాన్ని తిరిగి అమలు చేసి జవాబుదారీతనాన్ని పెంచాలని కోరారు.

• పీర్జాదిగూడ గుట్టలో సీసీ రోడ్ల నిర్మాణం:
పీర్జాదిగూడ గుట్ట పరిధిలోని ఇరుకైన గల్లీలలో సీసీ రోడ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాల కారణంగా మట్టి కొట్టుకుపోవడం, గుంతలు ఏర్పడటం, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున తక్షణమే సర్వే నిర్వహించి సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, తమ హయాంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, స్ట్రీట్ లైట్లు, మంచినీటి పైప్‌లైన్లు, నల్లా కనెక్షన్లు వంటి అనేక మౌలిక సదుపాయాలను ప్రజలకు అందించామని గుర్తుచేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు, పారిశుద్ధ్య సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి ప్రజారోగ్యం, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జోనల్ కమిషనర్‌ను కోరారు.
BRS Party Kalvakuntla Taraka Rama Rao - KTR KCR Vijayalaxmi Gadwal, GHMC MAYOR

Want your public figure to be the top-listed Public Figure in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Address


Peerzadiguda Municipal Corporation
Hyderabad
500098