Slobo Comedian
05/01/2023
:05-01-2023
ములుగు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భవనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పి డా.సంగ్రాంసింగ్ జి. పాటిల్ ఐపిఎస్
జిల్లా నందు గల ములుగు పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్మించిన (పునరుద్దరించబడిన) సర్కిల్ ఇన్స్పెక్టర్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా ఎస్. పి డా. సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ గారు హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్. పి గారు మాట్లాడుతూ సరి అయిన వసతులతో కూడిన భవనాలు ఉన్నప్పుడు అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంతో పనిచేయగల్గుతారని దాని ద్వారా ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రజలు కూర్చునేలా వెయిటింట్ హాల్, కుర్చీలు లాంటి సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలియచేసారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రూమ్ పునరుద్దరించడానికి కృషి చేసిన C.I రంజిత్ కుమార్ గారిని దానికి తొడ్పడిన S.I ఓంకార్ యాదవ్ గారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పి ములుగు సుధీర్ ఆర్ కేకన్ ఐ. పి. ఎస్, ఏ. ఎస్. పి బి. సదానందం, డి. సి. ఆర్. బి డి.ఎస్.పి సుభాష్, సి. ఐ ములుగు మేకల రంజిత్ కుమార్, ఎస్. ఐ ఓంకార్ యాదవ్, ఎస్. ఐ లక్ష్మారెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Telangana State Police
Click here to claim your Sponsored Listing.
Category
Culinary Team
Attire
Contact the public figure
Address
Mulugu
34138