Jakkula Rajendhar
26/04/2025
గౌరవనీయులు, పెద్దలు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నేత,BRS అధ్యక్షుడు శ్రీ KCR గారి ఆధ్వర్యంలో ఉద్యమ పార్టీగా మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి,
2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది. సుదర్శన్ రావు, నాయిని నర్సింహారెడ్డి, హన్మంతరావు, గాదె ఇన్నయ్య, వి. ప్రకాశ్, నిమ్మ నర్సిం హారెడ్డి, నారాయణరెడ్డి, గొట్టె భూపతి, మందాడి సత్యనారాయణరెడ్డి, హరీశ్ రావు తదితరులు ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు ఏడాదికిపైగా జలదృశ్యంలోనే టీఆర్ ఎస్ పార్టీ కార్యకలాపాలు సాగాయి. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో పార్టీ ముఖ్యపాత్ర పోషించింది.
అక్కడ నుంచి మొదలైన తెరాస ప్రస్తానం అనేక ఒడిదుడుకులు, అవమానాలు,విజయాలు, అపజయాలు,
అన్నింటినీ తట్టుకుని మలి దశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో,తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీ KCR గారి పాత్ర తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువలేనిది.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి, కొత్త రాష్ట్ర పాలన పగ్గాలు శ్రీ KCR గారు చేపట్టారు.2018 ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఆయన రెండవసారి కూడ రాష్ట్ర ప్రభుత్వం పాలనను కొనసాగించారు.
అలా దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణాను ఏలిన Kcr గారు తెరాస పార్టీ. మధ్యలో పార్టీ పేరు మార్పు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర దిశగా అడుగులు వేసి 2023 ఎన్నికల్లో 39 సీట్లతో ప్రతిపక్షంలో వచ్చారు.
అయితే ఒక ఉద్యమ పార్టీగా మొదలైన తెరాస ప్రస్తానం,
ఫక్తు రాజకీయ పార్టీగా మారి, 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా BRS నాయకులు కార్యకర్తలకు BRS రజతోత్సవ శుభాకాంక్షలు.
ఒక రాజకీయ పార్టీ నడపడం మామూలు విషయం కాదు. చరిత్రలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ కొన్ని మాత్రమే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమాజంలో నిత్యం జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నడుస్తున్నాయి. తెలంగాణ చరిత్రలో తెరాస పార్టీకి, శ్రీ KCR గారికి ప్రత్యేక పేజీలు ఉంటాయి.
ఇలాంటి 25 వసంతాల పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేల మరొక్కసారి మన రాజకీయ అవగాహన వేదిక నుండి Brs నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ హార్దిక శుభాకాంక్షలు....
ఇట్లు.
రాజకీయ అవగాహన వేదిక..
Whatsup Group
https://chat.whatsapp.com/E8HzU9NCutt0WusjWuTIHW
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
505331